NATIONAL JOBS | ఓఎన్‌జీసీలో 2236 అప్రెంటీస్ ఖాళీలు
NATIONAL JOBS | ఓఎన్‌జీసీలో 2236 అప్రెంటీస్ ఖాళీలు
ఓఎన్‌జీసీలో 2236 అప్రెంటీస్ ఖాళీలు
దరఖాస్తులకు ఈ నెల 25 వరకు గడువు
నవంబర్ 15 న ఫలితాలు వెల్లడి
HYDERABAD : దేశ వ్యాప్తంగా ఉన్న అయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్‌జీసీ) సెక్లార్లలో 2,236 అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుద లైంది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవడానికి ఈ నెల 25 (అక్టోబర్ 25) వరకు గడువు విధించారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. నవంబర్ 15న ఫలితాలు విడుదల చేయనున్నారు.
ONGC Apprentice Recruitment 2024 : Overview
అర్హతలు ఈ విధంగా ఉండాలి : విభాగాల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. టెన్త్ క్లాస్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీఈ, బీటెక్ ఉత్తీర్ణులైన ఉండాలి. అయితే ఈ నెల 25 వరకు 18 నుంచి 24 మధ్య వయసు కలిగి ఉండాలి. జీతం విషయానికొస్తే.. డిగ్రీ వారికి రూ. 9000, డిప్లొమా వారికి 8,050, ఐటీఐ వారికి రూ.7000 నుంచి రూ.8,050 వరకు నెల వారీగా చెల్లింపులు ఉంటాయని ఓన్‌జీసీ ఒక ప్రకటనలో తెలిపింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మార్కులు, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారని తెలిపారు. ఆన్‌లైన్ దరఖాస్తులు ఇతర వివరాల కోసం www.ongcindia.com అనే వెబ్‌సైట్‌ను సంప్రదించాలి.
విభాగాలు ఈ విధంగా ఉన్నాయి : అకౌంట్స్ ఎగ్జిక్యూటీవ్, డేటా ఎంట్రి ఆపరేటర్, సెక్రటేరియల్ అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్లు, సివిల్ ఎగ్జిక్యూటీవ్, పెట్రోలియం ఎగ్జిక్యూటీవ్, ఆఫీస్ అసిస్టెంట్, ఫైర్ సేఫ్టీ టెక్నిషియన్, ఫిట్టర్, మెకానికల్ డీజిల్, ఇను స్ట్రూమెంట్ మెకానికల్, స్టోర్ కీపర్, మిషినిస్టు, సర్వేయర్, వెల్డర్, ఫైర్ సేఫ్టీ టెక్నిసియన్, మెకానికల్ డీజిల్ వంటి వాటిలో అప్రెంటీస్ ఉంటుందని సంస్థ ఒక ప్రకటనలో ప్రకటించింది.
* * *
Leave A Comment